Trending: బంపర్ బొనాంజా.. ఒక్క రీల్ చేయండి.. లక్ష ప్రైజ్ మనీ పట్టండి!

by Kavitha |   ( Updated:2024-08-16 14:23:21.0  )
Trending: బంపర్ బొనాంజా.. ఒక్క రీల్ చేయండి.. లక్ష ప్రైజ్ మనీ పట్టండి!
X

దిశ, సినిమా: హైద్రాబాద్‌కు తలమానికంగా భాసిల్లుతున్న "థ్రిల్ సిటీ - అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్"... సోషల్ మీడియా ప్రభావశీలుర సృజనాత్మకతకు సవాలు విసిరింది. అసాధారణమైన, అద్భుతమైన అనేక విశేషాల సమాహారంగా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న ‘థ్రిల్ సిటీ - థీమ్ పార్క్’లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ లాంటి వందలాది యాక్టివిటీస్‌ని బేస్ చేసుకుని షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రీల్స్‌ నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి, తలా లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెర తీసింది. అయితే యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఈ ‘థ్రిల్లింగ్ ఇన్ఫ్లేన్సర్ చాలెంజ్’ ఈవెంట్ కర్టెన్ రైజర్ వేడుకకు ముఖ్య అతిధిగా విశ్వక్‌సేన్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాస్‌కా దాస్ విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “ఈరోజు సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుంది. మీ టాలెంట్‌కి వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇందులోకి కొత్తగా ప్రవేశించేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు. అంతా మీ చేతుల్లోనే ఉంది” అని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ‘థ్రిల్ సిటీ’ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్‌కి కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న బందూక్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. “మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తాము. ఇటువంటి కార్యక్రమాలను ఇకపై కూడా కొనసాగిస్తాం. యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాము” అని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో థ్రిల్ సిటీ టీం ఫీయాక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ స్వీకర్‌తో పాటు హైదరాబాద్ వ్యాప్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








Advertisement

Next Story

Most Viewed