Vanijayaram : ఇండస్ట్రీలో విషాదం.. సింగర్ వాణీజయరామ్ కన్నుమూత

by Hamsa |   ( Updated:2023-02-04 11:05:35.0  )
Vanijayaram : ఇండస్ట్రీలో విషాదం.. సింగర్ వాణీజయరామ్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సింగర్ వాణీజయరాం (78) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. పలు హిట్ చిత్రాల్లో అద్భుత పాటలు పాడిన వాణీజయరాం మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి. ఆమె 1945 లో నవంబర్ 30 న తమిళనాడులోని వెల్లురులో జన్మించింది. కాగా, వాణీజయరాంకి ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 భాషల్లో దాదపు 20 వేల పాటలు పాడిన వాణీ జయరామ్.. తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఐదుగురు అక్కాచెల్లెళ్లో వాణీజయరాం ఐదో సంతానం.

READ MORE

కొడుకు కెరీర్ కోసం మెగాస్టార్ కథల వేట

Advertisement

Next Story