- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. రూ200 ఇస్తా వస్తావా అని అడిగేవాళ్లు.. నేను ఓకే చెప్పాశానని సీక్రెట్ బయటపెట్టిన బుల్లితెర నటి
దిశ, సినిమా: బుల్లితెర నటి కీర్తిభట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ షోతో చాలా పాపులర్ అయింది. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొన్న కీర్తి భట్ మంచి పేరు సంపాదించుకుని సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. మనసిచ్చి చూడు అనే సీరియల్‌తో తెలుగులోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మధురానగరిలో నటిస్తున్నారు. ఈమె నిజ జీవితం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది.
కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆమె తల్లిదండ్రులు, అన్నావదినలు చనిపోయారు. కీర్తి భట్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చాలా కాలం హాస్పిటల్లో ఉంది. ఈ ముద్దుగుమ్మ ఆ సమయంలో చాలా బాధలు పడింది. ఆ భయంకరమైన విషయాలను తనే ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ‘ప్రమాదంలో అందర్ని కోల్పోయిన తర్వాత తనని మంగళూరు తీసుకెళ్లారు.
అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ కూడా ఎవరికి చెప్పుకోలేని కష్టాలను ఎదుర్కొంది. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర తాకేవారు. స్పర్శ లేకపోయినా అది నాకు తెలిసేది. నేను ఫిట్ అయినా తర్వాత వాళ్లకి దూరంగా వచ్చేశాను. కానీ, ఎక్కడకైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. చివరికి ఆటో వాళ్ల దగ్గర కూడా అడిగా.. వాళ్లు నన్ను అదోలా చూసి.. రెండువందలు ఇస్తాను వస్తావా అని అడిగేవారు. సరే వస్తానని చెప్పేదాన్ని.. తర్వాత వాళ్ల బుద్ధి నాకు అర్థమయ్యేది’ అంటూ కీర్తి భట్ ఆవేదనగా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.