అందం వెనుక అంతులేని బాధ..

by Harish |   ( Updated:2022-11-03 14:57:29.0  )
అందం వెనుక అంతులేని బాధ..
X

దిశ, సినిమా: హీరోయిన్ అయితే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు. మంచి రెమ్యునరేషన్‌లు అందుకుంటారు. లైఫ్ ఫుల్ చిల్‌గా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, హీరోయిన్లది పైకి కనిపించేంత బ్యూటిఫుల్ ప్రపంచం మాత్రం కాదు. ఎన్ని బాధలున్నా వాటిని మొహంపై కనిపించకుండా మనల్ని అలరిస్తుంటారు. ఇక షూటింగ్ సమయంలో మేకప్‌, లైటింగ్ సహా చాలా హంగులున్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో ఎవరెవరు ఎలాంటి వ్యాధులతో పోరాడారు? ఓ సారి పరిశీలిద్దాం.

Samantha :

చిన్న వయసులోనే వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్, హాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం సమంత కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉందని చెప్పాలి. ఇలాంటి సమయంలో తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్‌ కారణంగా ఈ వ్యాధి బారినపడినట్టు తెలిపింది. గతంలో సమంత చర్మ సంబంధ వ్యాధితో బాధ పడింది.

Nayanthara :

'చంద్రముఖి'తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది నయనతార. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో నటించి లేడీ సూపర్‌‌స్టార్‌‌గా పేరు తెచ్చుకుంది. మేకప్‌ కారణంగా ఎలర్జీ రావడంతో చాలాకాలం చికిత్స తీసుకున్న నయన్‌ ప్రస్తుతం కోలుకుంది.

Ileana D'Cruz :

'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఇలియానా కూడా చాలాకాలం పాటు బాడీ 'డిస్మార్ఫిక్ డిజాస్టర్‌'‌తో బాధపడింది. ఇదొక మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వాళ్లు తమ శరీరం, అందం గురించి నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. తాము అందంగా లేమని ఆందోళన చెందుతుంటారు. చాలాకాలం ఈ వ్యాధితో బాధపడిన ఇలియానా చికిత్స తర్వాత కోలుకుంది.

Deepika Padukone :

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే చాలాకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుంది. రణ్‌బీర్‌‌ కపూర్‌‌తో బ్రేకప్ అయిన తర్వాత మానసికంగా కుంగిపోయింది. డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి చికిత్స తీసుకుంటోంది. ఇప్పటికీ ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Mamta Mohandas :

హీరోయిన్‌గా, సింగర్‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'యమదొంగ', 'కేడీ', చింతకాయల రవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే క్యాన్సర్‌తో పోరాడింది. కొంతకాలం నటనకు బ్రేక్ తీసుకుంది. చికిత్స అనంతరం కోలుకుని సెకండ్‌ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇటీవల మరోసారి క్యాన్సర్ బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sneha Ullal (స్నేహా ఉల్లాల్) :

'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ పోలికలున్న స్నేహ టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. ఇక ఈమె కూడా 'ఆటో ఇమ్యూన్' సమస్యతో బాధపడింది. సమస్య తీవ్రం కావడంతో కొన్నాళ్లు బెడ్‌పైనే ఉండి చికిత్స తీసుకుంది. ప్రస్తుతం సమస్య నుంచి బయటపడినప్పటికి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఇక ఇండస్ట్రీల్లో వీళ్లు మాత్రమే కాకుండా చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు.

Advertisement

Next Story