Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోల చూపులు ఆగస్ట్ వైపే ఉన్నాయి.. ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-03 09:45:44.0  )
Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోల చూపులు ఆగస్ట్ వైపే ఉన్నాయి.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో ప్రస్తుతం ట్రెండ్ మారింది. కీలక మైన సీజన్లు సంక్రాంతిని తలపిస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కోసం, భారీ ఓపెనింగ్స్ కోసం రిస్క్ తీసుకోని మరి పోటీకి సిద్ధమే అంటున్నారు నిర్మాతలు. ఆరు నెలలో ముందే Independence Day వీక్ ను బుక్ చేసేసుకున్నారు.

సమ్మర్ ను వదిలేసిన స్టార్ హీరోస్ ఇప్పుడు Independence Day పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మహేష్ ప్రాజెక్ట్ ఆగస్ట్ 11 న విదుదల అంటూ డేటును అనౌన్స్ చేసారు మేకర్స్. చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్ కూడా అదే డేటును ఫిక్స్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రవి తేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరావు కూడా ఆగష్టు రెండో వారంలో విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఒక వేళ మహేష్ సినిమా విడుదలవ్వక పోతే అదే రోజున డీజే టిల్లు 2 సినిమా విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా యానిమల్ సినిమా కూడా ఆగస్ట్ 11 కి విడుదల చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు రెండో వారంలో వారి సినిమాలు విడుదల చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట.

ఇవి కూడా చదవండి :

1.రానాతో చేయడం బిగ్ ఛాలెంజ్ అంటున్న వెంకీ

2.‘బలగం’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. తెలంగాణ యాసతో అదరగొట్టిన ప్రియదర్శి

Advertisement

Next Story