కమెడియన్‌గా పేరు తెచ్చుకోవాలి.. తన డ్రీమ్ బయట పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

by sudharani |   ( Updated:2024-07-11 15:04:40.0  )
కమెడియన్‌గా పేరు తెచ్చుకోవాలి.. తన డ్రీమ్ బయట పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
X

దిశ, సినిమా: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తన నటన, డ్యాన్స్, నేచురల్ అందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ.. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. ప్రతీ నటీనటులకు ఎన్ని సినిమాలు చేసిన, ఆ రోల్స్ ద్వారా ఎంత గుర్తింపు వచ్చి వాళ్లకంటూ కొన్ని పాత్రలు చెయ్యాలని ఉంటుంది. అలాంటి తన కోరికను బయట పెట్టింది ఈ లేడీ పవర్ స్టార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవిని మీ డ్రీమ్ రోల్ ఏంటని ప్రశ్నించింది యాంకర్. దీనిపై స్పందించిన నేచురల్ బ్యూటీ మాట్లాడుతూ.. ‘నాకు కామిక్ రోల్ అంటే చాలా ఇష్టం. నేను సినిమాలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నవ్వించాలి. అలాగే హీరోయిన్‌గా మాత్రమే కాకుండా లేడీ కమెడియన్ అని కూడా అనిపించుకోవాలి. అలాంటి పాత్ర ఒక్కటి వచ్చినా చాలు నటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Advertisement

Next Story