Hot News: సల్మాన్‌‌తో పూజా‌హెగ్దే లవ్‌లో ఉందా?

by Hamsa |   ( Updated:2022-12-08 09:25:33.0  )
Hot News: సల్మాన్‌‌తో పూజా‌హెగ్దే లవ్‌లో ఉందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఈ బ్యూటీకి గ్లామర్‌తో పాటు అదృష్టం కూడా కలిసిరావడంతో విజయవంతమైన చిత్రాలను సొంతం చేసుకుంది. ఇక భాషతో సంబంధంలేకుండా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలావుంటే.. పూజా పర్సనల్ లైఫ్ గురించి సంచలన రూమర్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఏమిటంటే.. వివాదాస్పద ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు మూవీ రివ్యూ‌లు ఇస్తూ కాంట్రవర్సి కామెంట్స్‌తో ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలు సృష్టిస్తాయే మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా పూజా హెగ్డే గురించి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 'బి టౌన్‌లో కొత్త ప్రేమ మొదలైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు' అని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా ఇందులో నిజమెంతో తెలియాల్సివుంది.

Also Read: అషు రెడ్డి కాళ్లు నాకిన RGV.. అదే ఫైర్‌లో తనివితీరా ముద్దుపెట్టిన భామ.. వీడియో వైరల్

Advertisement

Next Story