- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi-Balakrishna: ఒకే వేదికపై టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ.. ఎగిరిగంతేస్తున్న ఫ్యాన్స్!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో ఎంతలా ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇందులో పలువురు టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కల్యాణ్, రవితేజ, రానా, చంద్రబాబు పాల్గొని సందడి చేశారు. అయితే ఈ షో గతంలో అతిథుల కొరత కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో బాలయ్య అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. విజయ దశమి నుంచి ఈ సీజన్ మొదలు పెట్టే ఆలోచనలో ఆహా సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ షో లో పలువురు రాజకీయ నాయకులను, జంటలను పిలవబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ఆనందానికి కారణం అయింది. అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు సమాచారం. చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదిక పంచుకుంటుండటంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.