గోవా బీచ్‌లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ నటి.. మొత్తం రొమాన్సే అంటూ ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-17 14:02:40.0  )
గోవా బీచ్‌లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ నటి.. మొత్తం రొమాన్సే అంటూ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో, ఫిగర్‌తో ఎంతో మంది కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాదు.. 50 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇకపోతే కెరియర్ ఓ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నటీమణులు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడతారు. కానీ, టబు మాత్రం వీటికి భిన్నంగా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమె పెళ్లి చేసుకోకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటూ వాదనలు వినిపించాయి. టబు లవ్‌లో ఫెయిల్ అయిందని అందుకే పెళ్లి చేసుకోలేదంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. టబుకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. ప్రస్తుతం ఆయనతో వెకేషన్ ఎంజాయ్ చేస్తుందట. ఈ మేరకు గోవా వెళ్లి అతడితో ఫుల్ రొమాన్స్ చేస్తుందట టబు. ఈ విషయాన్ని తెలిపింది మరెవరో కాదు.. తనని తాను సినీ క్రిటెక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు. ఇండస్ట్రీలో నటీనటుల గురుంచి ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ వివాదం సృష్టించే ఇతడు తాజాగా టబు గురించి ఓ ట్వీట్ చేశాడు. ‘‘టబు గోవాలో తన ప్రియుడితో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. గోవా బీచ్‌లలో పూర్తి సమయం రొమాన్స్ జరుగుతోంది’ అంటూ కాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశాడు. కాగా.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed