- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్‌లో వరుసగా విడుదలకాబోతున్న Tollywood Movies.. ప్రేక్షకులకు పండగే!
దిశ, సినిమా: గత కొన్ని నెలలుగా టాలీవుడ్ నుంచి పెద్దగా సినిమాల విడుదల లేకపోవడంతో బాక్సాఫీస్ డల్ అయింది. రీసెంట్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలైన ‘ఆదిపురుష్’ డిజాస్టర్‌గా నిలిచి జనాలను నీరశపరిచింది. ఇక టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు చూడాలనుకుంటే సెప్టెంబర్ వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే ఆ నెలలో పాన్-ఇండియా మూవీస్ రెడీగా ఉన్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ, సమంత రొమాంటిక్ డ్రామా ‘ఖుషి’ సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక బాలీవుడ్ నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జవాన్’. షారుఖ్ నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 15న రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘బోయపాటి రాపో’ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అదే రోజు యూత్ అంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న ‘డీజే టిల్లు 2’ కూడా సెప్టెంబర్ 15న రాబోతుంది. మొత్తానికి ఈ సెప్టెంబర్‌లో ఇండియన్ బాక్సాఫీస్‌కు కాసుల పండగే.