టాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి

by Hamsa |
టాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరోయిన్ మేఘా ఆకాష్ తన బామ్మను కోల్పోయింది. ఈ విషయాన్ని మేఘా తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘‘డియర్ అమ్మమ్మ.. నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు అర్థం కావట్లేదు. అయినా నేను నీ లాంటి దాన్ని. కాబట్టి.. ఎలాగైనా బతికేస్తాను అని అనుకుంటున్నా. ఎంతో సరదాగా ఉండే నువ్వు ఎల్లప్పుడూ అందరి ఆకలి తీర్చేందుకే ప్రయత్నించేదానివి. ఎలాంటి సమయంలోనైనా అందరినీ నవ్వించేదానివి. రోజు నీతో పెట్టిన ముచ్చట్లు బాగా గుర్తొస్తున్నాయి. ప్రతీ ఆదివారం మనకు ఎంతో సరదాగా గడిచేది. ఇకపై ఆదివారాలు అలా ఉండవు. మాతో లేకపోయినా.. మాలో ఎప్పుడూ ఉంటావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ రాసుకొచ్చింది. కాగా, మేఘా ఆకాష్ లై, ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Next Story