టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌కు చంపేస్తానంటూ బెదిరింపులు.. భయాందోళనలో ఫ్యాన్స్!

by Anjali |   ( Updated:2023-12-14 06:11:47.0  )
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌కు చంపేస్తానంటూ బెదిరింపులు.. భయాందోళనలో ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ పూజా హెగ్దే. కానీ ప్రస్తుతం ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. చివరిసారిగా కేసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో అలరించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. అయితే తాజాగా పూజాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ హీరోయిన్‌కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఓ పాపులర్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రీసెంట్‌గా దుబాయ్‌లో జరిగిన గొడవ అనంతరం పూజాను చంపేస్తామని చాలామంది బెదిరిస్తున్నారు. దీంతో పూజా హెగ్డే అక్కడి నుండి వెంటనే ఇండియాకు వచ్చేసిందని చెప్పుకొచ్చారు.

వారు షేర్ చేసిన పోస్ట్‌‌ను కాసేపటి తర్వాత వెంటనే డిలీట్ చేశారు. ఈ వార్తలపై ఇప్పటికే పూజా హెగ్డే టీమ్ స్పందించి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నకిలీ వార్తలను ఎవరు ప్రారంభించారో మాకు తెలియదని అన్నారు. కానీ తాజాగా ఫొటో గ్రాఫర్ పెట్టిన పోస్ట్‌తో ఈ న్యూస్ నిజమేనని పూజా హెగ్దే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై పూజా హెగ్దే ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.

Advertisement

Next Story