Renu Desai: రేణు దేశాయ్‌కు టాలీవుడ్ హీరో సాయం.. రీల్, రియల్ లైఫ్ హీరో అంటూ పోస్ట్

by Hamsa |
Renu Desai: రేణు దేశాయ్‌కు టాలీవుడ్ హీరో సాయం.. రీల్, రియల్ లైఫ్ హీరో అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఆమె గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు తెలపడంతో పాటుగా.. జంతువులకు, అనాధ పిల్లలకు సాయం చేయమంటూ విరాళం అడుగుతుంది. తనకు తోచినంత సహాయం చేస్తూ బాధలో ఉన్నవారికి ఆదుకోవడంతో పాటుగా తన ఫాలోవర్స్‌ని కూడా విరాళం ఇవ్వమని వేడుకుంటుంది.

ప్రజెంట్ రేణు దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతూ వార్తల్లో సంచలనం సృష్టిస్తోంది. అలాగే తన మాజీ భర్త పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా అన్నా స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే రేణు దేశాయ్ నిన్న పెట్స్ కోసం రైస్ సాయం చేయాలని ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తాను 50 కేజీల రైస్ ఇచ్చానని, మిగిలింది అందరూ కలిసి ఇవ్వాలని వేడుకుంది.

ఈ క్రమంలో.. తాజాగా, రేణు దేశాయ్ పోస్ట్ చూసిన టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ స్పందించి తన వంతు సాయం చేశాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టా వేదికగా ప్రకటిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఓ పెట్‌కు ట్రీట్మెంట్ అవసరం ఉండటంతో పదిహేను వేలు సాయం చేశాడు. రీల్, రియల్ లైఫ్‌లోనూ నువ్వు హీరోవి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆయన ఫొటోను కూడా షేర్ చేసి ప్రశంసలు కురిపించింది. ప్రజెంట్ రేణు పోస్ట్ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ గ్రేట్ అని అంటున్నారు.

Advertisement

Next Story