- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. కళాతపస్వి K.Vishwanath కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ నటులు వరుసబెట్టి కన్నుమూస్తుండటం పరిశ్రమను కలవరపెడుతోంది. తాజాగా కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. విశ్వనాథ్ పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఐదు దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమను ఏలిన విశ్వనాథ్ ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన శంకరాభరణం చిత్రం విడుదలైన రోజే కన్నుమూయడం యాధృచ్చికమే. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించి నేటికీ లెజెండరీ చిత్రంగా మిగిలిపోయింది.
కె.విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న బాపట్ల (గుంటూరు) జిల్లా రేపల్లెలోని పెద్ద పులివర్రు గ్రామంలో జన్మించారు. కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ తల్లిదండ్రులు. సుబ్రహ్మణ్యంచెన్నైలోని విజయవాహిణీ స్టూడియోలో పని చేసేవారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్.. బీఎస్సీ ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ పూర్తికాగానే తండ్రి పని చేసే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1965లో ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన విశ్వనాథ్ 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లోనూ తొమ్మిది చిత్రాలకు ఆయన డైరెక్షన్ చేశారు.
ఇవి కూడా చదవండి : K.Vishwanath మరణం తీరని లోటు : CM KCR