- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక వీడియోపై టాలీవుడ్ సెలబ్రటీల సైలెన్స్.. నాగచైతన్య ఏమన్నారంటే?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియా మొద్దం చర్చానీయాంశమైంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి, అమితా బచ్చన్, కల్వకుంట్ల కవిత స్పందించిన విషయం తెలిసిందే. అలాగే రష్మిక కూడా ఓ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది. కానీ టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం స్పందించలేదు. తాజాగా, టాలీవుడ్ నుంచి మొదటగా నాగచైతన్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి’’ అంటూ రాసుకొచ్చాడు. తనకు సపోర్ట్‌గా నిలిచిన చైతుకు రష్మిక కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే రష్మిక యానిమల్, పుష్ప-2 సినిమాల షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో ఈ రెండు థియేటర్స్‌లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అలాగే టాలీవుడ్, బాలీవుడ్‌లో అమ్మడుకి క్రేజ్ మాములుగా లేదు.