అవకాశాలు తగ్గడంతో దానిపై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ బ్యూటీ.. ఈ వయసులో ఏంటిది..?

by sudharani |   ( Updated:2024-04-22 09:58:10.0  )
అవకాశాలు తగ్గడంతో దానిపై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ బ్యూటీ.. ఈ వయసులో ఏంటిది..?
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈమె.. నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రావడంలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అంజలి.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అంజలి ఈ మధ్య అందంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో బొద్దిగా కనిపించిన ఈ అమ్మడు.. ప్రజెంట్ స్లిమ్‌‌గా మారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వయసు పెరిగే కొద్ది గ్లామర్ డోస్ పెంచి.. కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ కలర్ శారీ అంజలి షేర్ చేసిన ఫొటో షూట్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు.. ‘వయసు పెరిగే కొద్ది అందం కూడా పెంచేస్తున్నావు.. ఈ వయసులో ఇంత అందం కష్టం’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed