షాకింగ్ : విడాకులకు సిద్ధమైన యాంకర్.. భర్తతో గొడవలే కారణమా?

by Jakkula Samataha |
షాకింగ్ : విడాకులకు సిద్ధమైన యాంకర్.. భర్తతో గొడవలే కారణమా?
X

దిశ, సినిమా : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. రోజు రోజుకు విడాకుల కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బుల్లితెర, వెండితెరపై ఎంతో మంది స్టార్ నటీనటులు విడాకులు తీసుకొని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుల్లితెర నటి శిరీష కూడా తాను విడాకులు తీసుకున్నాను అని ప్రకటించింది. అయితే చిత్ర పరిశ్రమలో మరో బ్యూటీ విడాకులు తీసుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో తన అందంతో మాయ చేసి యాంకరింగ్‌లోకి అడుగు పెట్టిన ఓ ముద్దుగుమ్మ విడాకులకు సిద్ధమైదంట. యాంకర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా తన కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగిందంట. కానీ తన గ్లామర్‌తో మాత్రం అందరి మతి పొగొట్టి, మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న చిన్నది, ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటుందంట. ముఖ్యంగా ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ వలన ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది. తర్వాత మెల్లిగా తన కెరీర్‌ను అందంగా మలుచుకుంటూ వచ్చి ఆడపాదడపా ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తుంది. ఇక తన స్మైల్, డ్రస్సింగ్ స్టైల్ వల్ల ప్రతి ఒక్కరూ తన పేరునే తలిచేలా చేసుకున్న ఈ యాంకర్ చిన్న వయసులో పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో పబ్లిక్‌లోకి రాకుండా జాగ్రత్త పడింది. గ్లామర్ ఇమేజ్ పోకుండా చూసుకుంది. ఇప్పుడు యాంకర్ లవ్ మ్యారేజ్ లో గొడవలు మొదలు అయ్యాయంట. దాంతో ఆవిడ భర్తకు దూరంగా ఉంటుంది. దీంతో ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్దపడుతోందని, వారు కలిసే ఛాన్స్ చాలా తక్కువ అని చిత్ర పరిశ్రమలో టాక్. మరి చూడాలి ఆ యాంకర్ జీవితంలో ఏం జరుగుతుందో అని అంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story