జైల్లో టాయిలెట్స్ కూడా కడిగానూ.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-08-15 06:51:41.0  )
జైల్లో టాయిలెట్స్ కూడా కడిగానూ.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోకు హోస్ట్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క షోకు నడిపిస్తూనే సినిమాలు, యాడ్స్‌లో కూడా చేస్తున్నాడు. అయితే ఓటీటీ బిగ్‌బాస్‌కు కూడా సల్మాన్ హోస్ట్‌గా చేస్తున్నాడు. తాజాగా, హీందీ ఓటీటీ బిగ్‌బాస్ పూర్తయింది. అందులో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ట్రోఫిని సాధించాడు. అయితే ఫైవన్ ఎపిసోడ్‌లో సల్లూ భాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫైనలిస్టులో ఉన్న పూజభట్‌ను అభినందిస్తూ ‘‘ నీలాగ క్లీన్‌గా ఎవరూ ఉంచలేరు. టాయిలెట్స్ కూడా మొహమాటపడకుండా కడిగావు. నేను కూడా అలాగే చేశాను. నేను చదువుకునేటప్పుడు బోర్డింగ్ స్కూల్‌లో టాయిలెట్స్ క్లీన్ చేశాను. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా టాయిలెట్స్ కడిగాను. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు. ఏ పని కూడా తక్కువ కాదు. దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: RGV Vyooham Teaser 2 : ఆసక్తి పెంచుతోన్న కీలక నేతల పాత్రలు..!

Advertisement

Next Story

Most Viewed