AAY Movie : నేడు ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ సిద్ధార్థ్

by Prasanna |   ( Updated:2024-08-13 11:27:03.0  )
AAY Movie : నేడు ఆయ్  ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ సిద్ధార్థ్
X

దిశ, సినిమా: నార్నె నితిన్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత ఎన్టీఆర్ బామ్మర్ది అని చాలా మందికి తెలిసింది. మ్యాడ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయ్‌ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. అంజి కె డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని GA 2 పిక్చర్స్‌ బ్యానర్ పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. నయన్‌ సారిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఆగ‌స్టు 15న ఆడియెన్స్ ను ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ప్ర‌మోషన్స్ మీద దృష్టి పెట్టింది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు సాయంత్రం నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పటికే ఈ ఈవెంటు కోసం హైద్రాబాద్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ హాజరుకానున్నారు. ఈ మేరకు మూవీ టీం ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుదల చేసింది.

ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే.. సినిమా మొత్తం గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే రిలీజ్ అయినా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలిపారు.

Advertisement

Next Story