Hero Suman: నేడు సినీయర్ హీరో సుమన్ పుట్టినరోజు

by Prasanna |   ( Updated:2024-08-28 14:46:27.0  )
Hero Suman: నేడు సినీయర్ హీరో సుమన్ పుట్టినరోజు
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఇండియా సీనియర్ యాక్టర్ హీరో సుమన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో అడుగు కొద్దికాలంలోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఈ హీరో తమిళ సినిమాలు ఎక్కువ చేసాడు. తెలుగు వారికి యాక్టర్ భానుచందర్ పరిచయం చేసాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి పట్టు ఉంది. టి కృష్ణ డైరెక్షన్లో వచ్చిన నేటి భారతం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుమన్ తల్వార్ ఆగస్టు 29వ తేదీ 1959న చెన్నైలో జన్మించాడు. ఇప్పటికి 150కి పైగా సినిమాలలో యాక్ట్ చేసి రికార్డు క్రియోట్ చేసాడు. హీరో దగ్గర నుంచి విలన్ వరకు నటించగల సత్తా ఉన్న నటుడు. 2021లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు సుమన్. నేడు తన 65 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed