నేడు రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బర్త్ డే

by Anjali |   ( Updated:2023-11-01 04:26:11.0  )
నేడు రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బర్త్ డే
X

దిశ, వెబ్‌డెస్క్: రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. వ్యాపార కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలకు గాను ఈమె అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఆరు పదుల వయసు దగ్గర పడుతోన్న కూడా నీతా అంబానీ ఎంతో యంగ్‌గా కనిపిస్తుంది. ఈమె హై ప్రొఫైల్ వెడ్డింగ్‌లో ధరించిన ఆకుపచ్చ చీర ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా వార్తల్లో నిలిచింది. అప్పుడు ఈమె చీరతో పాటు అందంపై నెటిజన్లు కామెంట్ల మోత మోగించారు.

ఖరీదైన డిజైనర్ దుస్తులను ధరించిన నీతా, 2015లో మాజీ రాజ్యసభ ఎంపీ పరిమత్ నత్వానీ కుమారుడి వివాహ వేడుకలో పచ్చలు, ఇతర క్రిస్టల్స్‌తో నిండిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ రంగు చీరను ధరించారు. పింక్ చీర నిజమైన ముత్యాలు, పచ్చలు, కెంపులు , ఇతర రత్నాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ చీరలో కళ్లు చెదిరే ఫీచర్ బ్లౌజ్. అందులో కృష్ణుడి బొమ్మను డిజైన్ చేయడం విశేషం. ఈ ఖరీదైన చీరను కాంచీపురంకు చెందిన 35 మంది మహిళా కళాకారులు రూపొందించారు. దీని ధర 40 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా. ఇలా నీతా అంబానీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా నేడు నీతా అంబానీ 60 ఏళ్లలో అడుగుపెడుతుంది. తన పుట్టిన రోజు సందర్భంగా నీతాకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story