నీతో నువ్వు మంచిగా ఉండు.. అన్ని గాయాలకు కాలమే సమాధానం చెప్తుంది: నిహారిక పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-05-19 09:04:09.0  )
నీతో నువ్వు మంచిగా ఉండు.. అన్ని గాయాలకు కాలమే సమాధానం చెప్తుంది: నిహారిక పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక కొణిదెల విడాకుల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇరువురు వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ నుంచి తమ పెళ్లి ఫొటోలను సైతం డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లుయింది. ఇదిలా ఉంటే.. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం హైదరాబాద్‌లో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది. ఈ క్రమంలోనే తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్‌కు సంబంధించిన ఫొటోలు నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. ఇలా తన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న నిహారిక.. తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

అందులో తాను జిమ్ చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. చాలా కొటేషన్స్ పెట్టారు. ‘‘నీతో నువ్వు మంచిగా ఉండూ.. అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే తను ఏ విషయం నుంచో బయట పడాలని చూస్తుంది. అందుకే ఇలాంటి కొటేషన్స్ పెడుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నిహారిక జిమ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read more:

‘ఏ వతన్ మేరే వతన్’పై సారా ఎమోషనల్.. పోస్ట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed