విజయ్ ‘ది గోట్’ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-08-17 12:41:50.0  )
విజయ్ ‘ది గోట్’ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: దళపతి విజయ్, మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా.. ఏజీఎప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై కల్పతి ఎస్ అఘోరం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇందులో ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరాం, యోగిబాబు వంటి నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే ది గోట్ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ ది గోట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్ ఆగస్టు 17న సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా స్టైలిష్ డ్రెస్ ఉన్న విజయ్ గన్‌తో షూట్ చేస్తూ కోపంగా ఉన్న స్టిల్‌ను షేర్ చేశారు. కాగా, ఇందులో విజయ్ డబుల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story