Rajinikanth: రజినీకాంత్ ‘వెట్టైయాన్’ ట్రైలర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్టర్

by Hamsa |
Rajinikanth: రజినీకాంత్ ‘వెట్టైయాన్’ ట్రైలర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టీజీ జ్ఞానవేల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వెట్టైయాన్’. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ నుంచి స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే వెట్టైయాన్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. అక్టోబర్ 10న దసరా కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

తాజాగా, వెట్టైయాన్ మేకర్స్ క్రేజీ అప్‌డేట్ విడుదల చేస్తూ ఓ పోస్టర్‌ను ‘X’ ద్వారా షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వెట్టైయాన్‌పై అంచనాలు పెంచుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ పోస్టర్‌లో రజినీ బుల్లెట్స్ మధ్యలో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వెట్టైయాన్‌పై అంచనాలను పెంచుతోంది. అయితే వెట్టైయాన్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో మూడు చోట్ల డైలాగ్స్ మార్చాలని చిత్ర బృందానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు ఉన్నట్లు టాక్.

Advertisement

Next Story

Most Viewed