కిచ్చా సుదీప్‌కు బెదిరింపు కాల్స్.. ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామంటూ

by Prasanna |
కిచ్చా సుదీప్‌కు బెదిరింపు కాల్స్.. ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామంటూ
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది స్టార్ హీరోలు పాలిటిక్స్‌లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా బుధవారం బీజేపీలో చేరనున్న సుదీప్‌కు రెండు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామని, అసభ్యకరంగా మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో సుదీప్ మేనేజర్ జాక్ మంజు.. బెంగుళూరులోని పుట్టెనహళ్లి పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ లేఖ ఎవరు పంపారు? ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయంపై విచారణ మొదలు పెట్టినట్లు తెలిపారు.

Advertisement

Next Story