ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి.. అనసూయ హాట్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-10-04 04:11:26.0  )
ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి..  అనసూయ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ ‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోని అందాల ఆరబోత గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిత్యం మతి పోగొట్టే హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇకపోతే నేడు (అక్టోబరు 4)తన భర్త శుశాంక్ భరద్వార్ పుట్టినరోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. కుటుంబసభ్యుల మధ్య కేక్ కట్ చేపించి.. చిరునవ్వులు చిందిస్తూ సోషల్ మీడియాలో.. ‘ఈ ప్రపంచానికి నీలాంటి కొడుకు కావాలి. నీలాంటి తమ్ముడు, నీలాంటి అల్లుడు, నీలాంటి తండ్రి, ఈ ప్రపంచానికి నీ లాంటి మంచి మనస్తత్వం ఉన్న మనుషులు కావాలి. నా విషయంలో అది నువ్వు చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు శ్రీవారు.’ అంటూ అనసూయ కామెంట్ రాసుకొచ్చింది. అలాగే శుశాంక్‌ చేత కేక్ కట్ చేపించిన పిక్స్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.













Advertisement

Next Story