సినిమాలు అక్కర్లేదంటున్న జబర్దస్త్ బ్యూటీ.. అతన్ని వదల్లేకనా?

by Sathputhe Rajesh |
సినిమాలు అక్కర్లేదంటున్న జబర్దస్త్ బ్యూటీ.. అతన్ని వదల్లేకనా?
X

దిశ, సినిమా : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఆర్టిస్టులు ప్రస్తుతం వెండితెరపై బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. టీవీ షోస్ ద్వారా పొందిన క్రేజ్‌తో మూవీ ఆఫర్స్ చేజిక్కించుకుంటున్న నటులు.. అక్కడ కూడా పాపులారిటీ సంపాదిస్తున్నారు. 'జబర్దస్త్' కామెడీ షో యాంకర్లు అనసూయ, రష్మీ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కాగా.. ఇదే కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో వర్ష ఒకరు. కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో తను జంటగా చేసిన స్కిట్లు మంచి పేరు తీసుకురాగా.. తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. జబర్దస్త్ స్కిట్‌‌లో చేసే ప్రతీ సీన్ టీఆర్పీ రేటింగ్‌తో ముడిపడి ఉండదన్న వర్ష.. ఒక్కోసారి రియల్‌గానే ఎమోషనల్‌ అవుతామని, ఇమ్మూతో తనది స్పెషల్ బాండింగ్ అని చెప్పింది. ప్రస్తుతానికి సినిమాలపై ఆసక్తి లేదని, ఫ్యూచర్‌లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది.


Next Story