- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
అనంత్ అంబానీ పెళ్లిలో హైలెట్ ఇదే.. ఆ స్టార్ హీరో నాగిని డ్యాన్స్ ఇదిగో వీడియో
దిశ,సినిమా : ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం దేశం మొత్తం ఈ పెళ్లే గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మ్యారేజ్ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు చేసారని సమాచారం. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ జూలై 12న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ వెడ్డింగ్ కు దేశ నలుమూలల నుంచి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన సెలబ్రిటిస్ కూడా అటెండ్ అయ్యారు.
అనంత్ అంబానీకి బాలీవుడ్ కి చెందిన వారితో మంచి స్నేహం ఉంది. వారి కోసం స్పెషల్ గిఫ్ట్ లు కూడా ఇచ్చారు. ఈ వేడుక జరిగే సమయంలో హీరో రణవీర్ సింగ్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇతను గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెరపైన తన అల్లరి ఎలా ఉంటుందో ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు.
సినిమాలో ఎలా డ్యాన్స్ చేస్తాడో అనంత్ అంబానీ పెళ్లిలో కూడా అదే విధంగా కుమ్మేసాడు. పైగా ఈ వీడియోలో నాగిని డ్యాన్స్ హైలెట్ అచ్చం పాములాగా మెలికలు తిరుగుతూ నృత్యం చేసి అతిథులను అలరించాడు. అతనితో పాటు అర్జున్ కపూర్, వీర్ పహారియా కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రతీ పెళ్లిలో రణవీర్ సింగ్ లాంటి సందడీ చేసే ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.