Varun Tej-Lavanya Tripathi: ఎంగేజ్‌మేంట్ అతిథుల లిస్ట్ ఇదే..

by Anjali |   ( Updated:2023-06-09 10:16:38.0  )
Varun Tej-Lavanya Tripathi: ఎంగేజ్‌మేంట్ అతిథుల లిస్ట్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 8) న ‘‘ రెండు గుండెలు ఒక ప్రేమ.. కంగ్రాట్స్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య అని ప్రింట్ చేయించిన నిశితార్థం కార్డు ఓ మీడియా ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ‘ మీరు జీవితాంతం బాగుండాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మెగా ఫ్యామిలీ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే వరుణ్ లావణ్య త్రిపాఠి’’ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఈ రోజు హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరగబోతుంది. వీరి ఎంగేజ్‌‌మెంట్‌కు రాబోయే అతిథుల లిస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారని సమాచారం. ఈ హీరోల సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకుని వస్తున్నారని తెలుస్తోంది. వరుణ్, లావణ్య నిశ్చితార్థానికి కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే హాజరు కానున్నారట. ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ అయ్యాక పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తారట. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరు‌లో వీరిద్దరి వివాహం ఉంటుందని సమాచారం.

Read more:

పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్

నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద త్యాగం చేసిందా!

సెలబ్రిటీస్ పెళ్లి.. మాకు నమ్మకం లేదు దొర

వరుణ్‌, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఎవరో తెలుసా?

Advertisement

Next Story