OTT Movie: కిరీటం నుంచి రక్త స్రావం.. తొలి యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ ఇదే అంటూ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్

by Prasanna |
OTT Movie: కిరీటం నుంచి రక్త స్రావం.. తొలి యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ ఇదే అంటూ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటీటీలోనే సినిమాలను చూసేందుకే ఇష్టపడుతున్నారు. వారి కోసం ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలను తీసుకొస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను విడుదల చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి హర్రర్ మూవీ వరకు వస్తున్నాయి. తాజాగా మన తెలుగు డైరెక్టర్స్ రాజ్ నిడమోరు, కృష్ణ డీకే వెబ్ సిరీస్ తీసేందుకు సిద్ధమయ్యారు.

హిందీలో ఫ్యామిలీ మ్యాన్ లాంటి హిట్ సిరీస్ ను రూపొందించిన దర్శకులు ఈ ఫ్యాంటసీ సిరీస్ ను నిర్మిస్తున్నారు. కొత్త వెబ్ సిరీస్ ను అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబందించిన పోస్టర్, క్యాప్షన్ కూడా సినిమాపై హైప్ ను క్రియోట్ చేస్తున్నాయి.

“మీ రక్తాన్ని మరిగించే ఓ పెద్ద వార్త మా దగ్గర ఉంది. మేము మా మొదటి యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ ను అనౌన్స్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం " అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. డైరెక్టర్ అనిల్ బార్వే డైరెక్షన్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కు వహిస్తున్నారు. “రక్త్ బ్రహ్మాండ్.. ది బ్లడీ కింగ్ డమ్ ” అనే టైటిల్ తో అనౌన్స్ చేసారు.

Advertisement

Next Story