‘బ్యూటీఫుల్ ఆంటీ’.. కామెంట్‌కి రేణూ దేశాయ్ రిప్లై ఇదే..!

by sudharani |   ( Updated:2023-11-11 17:56:33.0  )
‘బ్యూటీఫుల్ ఆంటీ’.. కామెంట్‌కి రేణూ దేశాయ్ రిప్లై ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రేణూ దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా రేణు తనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అహభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ కాగా.. నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

‘నా చీర, నా బొట్టు మొత్తం బ్లూ బ్లూ’ అంటూ వీడియో షేర్ చేసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు సూపర్ అక్క, బాగున్నారు మేడం, వదిన బంగారం అంటూ కామెంట్లు పెట్టారు. ఇక నటుడు ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్ కూడా ‘So Beautiful aunty’ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి ‘థాంక్యూ బేబీ’ అని రిప్లై ఇచ్చింది రేణు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story