- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Poonam Pandey Death: : పూనమ్ పాండే చివరి వీడియో ఇదే..ఆందోళనలో ఫ్యాన్స్!
దిశ, సినిమా: ప్రముఖ నటి పూనమ్ పాండే మొదట మోడల్‌గా పరిచయం అయి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎక్కువగా సోషల్ మీడియాలో పలు వివాదాస్పద కామెంట్స్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే నేడు ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆమె ఫ్యాన్స్ నిన్నటి మొన్నటి వరకూ పలు ఈవెంట్స్ నవ్వుతూ కనపడిన ఆమె చనిపోవడమేంటని షాక్‌లో ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. పూనమ్ చివరి సారిగా షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
సముద్రంలోని బోట్‌లో ఓ ఈవెంట్‌కు ఆమె హాజరైంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి కనిపించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా బ్లాక్ అండ్ వైట్ నా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తాయని క్యాప్షన్ జత చేసింది. అందులో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. దీంతో ఈ వీడియోను చూసిన వారు కొందరు షాక్ అవుతున్న ఎమోజీలు షేర్ చేశారు. మరికొందరు మాత్రం ఇంత యాక్టీవ్‌గా ఉన్న ఆమె ఇంత సడెన్ చనిపోయిందంటే నమ్మబుద్ది కావట్లేదని కామెంట్లు చేస్తున్నారు.