Prabhas-Payal: ప్రభాస్‌తో పెళ్లిపై పాయల్ రియాక్షన్ ఇదే.. షాకింగ్ కామెంట్స్ వైరల్!

by Hamsa |
Prabhas-Payal: ప్రభాస్‌తో పెళ్లిపై పాయల్ రియాక్షన్ ఇదే.. షాకింగ్ కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అమ్మడు వరుస ఆఫర్లు పట్టేసింది. ఆ తర్వాత వెంకీ మామ, జిన్నా, తీస్ మార్ ఖాన్, మంగళవారం వంటి మూవీస్ చేసి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఈ అమ్మడు రక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటించడంతో పాటుగా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, పాయల్ రాజ్‌పుత్ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలకు ఈ అమ్మడు పాల్గొంది. ఇందులో భాగంగా ప్రభాస్‌తో పెళ్లిపై స్పందించింది. ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్‌లో ఏది బాగా అనిపించింది అని యాంకర్ అడగ్గా.. దానికి పాయల్ రియాక్ట్ అవుతూ.. ప్రభాస్‌తో నా పెళ్లందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

వాటిని చూసి నేను చాలా నవ్వుకున్నాను. కానీ ఆ వార్తలు నిజమైతే ఎంత బాగుండు అని కూడా అనుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆయన పెళ్లి చేసుకోకున్నా కానీ అందిరితో పెళ్లి అయిపోయింది అని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed