Pawan Kalyan : ఆ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌‌కు ఇష్టమైన డైరెక్టర్ ఇతడే?

by Anjali |
Pawan Kalyan : ఆ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌‌కు ఇష్టమైన డైరెక్టర్ ఇతడే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా వారు పవన్ కల్యాణ్ ను పాలిటిక్స్‌తో పాటు సినిమాల గురించి కూడా పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తమిళ్‌లో పవన్ కు ఇష్టమైన దర్శకులు అండ్ కమెడియన్ ఎవరని అడిగారు. దీనికి పవర్ స్టార్ బదులిస్తూ.. తమిళ్ లో కమెడియన్ అంటే యోగి బాబు ఇష్టమని వెల్లడించారు. అంతేకాదు రీసెంట్ గా తెరకెక్కిన ఆయన నటించిన చిత్రం చూశానని అన్నారు.

యోగి బాబు కామెడీ యాక్టింగ్ బాగుంటుందని, బాగా నవ్వుకున్నానని వ్యాఖ్యానించారు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే.. మణిరత్నం తెరకెక్కించే మూవీస్ ఇష్టమని అన్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ బాగుంటుందని తెలిపారు. రీసెంట్‌గానే విక్రమ్, లియో చిత్రాలు చూశానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. లోకేష్ ఇండియా వైడ్ ఫేమస్ డైరెక్టర్ కాబట్టి పవర్ స్టార్ అండ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కితే థియేటర్స్ దద్దరిల్లుతాయంటూ ఫ్యాన్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

Read More : తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Next Story

Most Viewed