Ranveer-Deepika: మా కూతురు ఫస్ట్ మూవీ ఇదే.. రణ్‌వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-07 15:28:34.0  )
Ranveer-Deepika: మా కూతురు ఫస్ట్ మూవీ ఇదే.. రణ్‌వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సింగం అగైన్’. ఇందులో అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. అలాగే దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రణ్‌వీర్ మొదటి సారి తన కూతురు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘రోహిత్ శెట్టి సింగం ఫ్రాంచైజీలో నేను మరోసారి నటించడం చాలా సంతోషంగా ఉంది.

ఇందులో నా భార్య దీపికా పదుకొణె కూడా మాస్ అవతార్‌తో కనిపించింది. ఆమెను అలా చూడటం ఆనందంగా అనిపించింది. ప్రస్తుతం దీపికా తల్లి బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మా బేబీని చూసుకోవడంలో చాలా బిజీగా ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదు. రాత్రిపూట పాపను నేను చూసుకుంటున్నా. ఈ కారణం వల్ల నేను ఇప్పుడు వచ్చాను. ఈ సినిమాతో రోహిత్ శెట్టి యూనివర్స్‌లోకి దీపికా ఎంట్రీ ఇచ్చింది. అయితే నిజం చెప్పాలంటే మా కుమార్తె తొలి సినిమా ఇదే.

ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ సమయంలో దీపిక ప్రెగ్నెంట్ అయింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, దీపికా పదుకొణె ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ సినిమాలకు మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. సింగంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కిలోనూ ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు దీపికా కూతురు పుట్టకుండానే రెండు సినిమాల్లో నటించింది గ్రేట్ అని అంటున్నారు.

Advertisement

Next Story