Raj Tarun: 'తిరగబడరసామీ' టైటిల్ సాంగ్ రిలీజ్.. మాస్ లుక్‌లో అలరించిన రాజ్ తరుణ్

by sudharani |
Raj Tarun: తిరగబడరసామీ టైటిల్ సాంగ్ రిలీజ్.. మాస్ లుక్‌లో అలరించిన రాజ్ తరుణ్
X

దిశ, సినిమా: యంగ్ హీరో రాజ్ తరుణ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. యూత్‌ని ఆకట్టుకునే రోమాన్స్‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఇక మంచి అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

దీంతో రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా.. 'తిరగబడరసామీ' టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. కంపోజర్ జెబి ఈ సాంగ్‌ని పవర్ ఫుల్‌గా ట్యూన్ చేశారు. సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి వోకల్స్ ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. అంతే కాకుండా రాజ్ తరుణ్ ఇందులో మాస్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో కనిపించి మెప్పించాడు. కాగా.. సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్‌తో పాటు ఒక స్పెషల్ సాంగ్‌లో అలరించబోతుంది.

Advertisement

Next Story