- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఛాన్స్ ఇస్తా కోరిక తీర్చమని డోర్ కొట్టేవారు.. ఎయిడ్స్ రావడంతో భయపడిపోయారు.. అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ఇండస్ట్రీలో అమ్మ, బామ్మ, అత్త క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ. అలాంటి అన్నపూర్ణమ్మ దాదాపు మూడు తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈమె ఇప్పటికీ కూడా బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కామెడీ షో లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది నటీనటులు తమకు జరిగిన పరిస్థితులను పంచుకున్నారు. అయితే తాజాగా అన్నపూర్ణమ్మ కూడా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఇబ్బంది గురించి పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఇక నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా మంది ఆఫర్ ఇస్తాము కానీ మరి నాకేంటి అనే విధంగా అడిగేవారు. ఇక ఆ భయంతో నేను 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని 25 ఏళ్లకే తల్లి పాత్రలు చేయడం మొదలు పెట్టేసాను. ఇక సినిమా షూటింగ్స్‌లో భాగంగా ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. అప్పుడప్పుడు రాత్రి సమయంలో కూడా అక్కడే ఉండాల్సి వచ్చేది. ఆ టైం లో కొంతమంది చిల్లర వెధవలు మా రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టేవారు. అర్ధరాత్రి పూట వాళ్ళు చేసే పనులకు మేము చాలా భయపడి పోయే వాళ్ళం. ఇక ఎప్పుడైతే ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చిందో అప్పటినుండి చాలామంది పరాయి వారితో ఆ పని చేయడానికి భయపడిపోయారు. ఆ వ్యాధి వచ్చాక ఇలాంటివి చాలా తగ్గిపోయాయి అంటూ అన్నపూర్ణమ్మ సంచలన కామెంట్లు చేసింది.