నీవు పనికిరావంటూ ఎగతాళి చేశారు.. కట్‌చేస్తే ఇప్పుడామె స్టార్ హీరోయిన్!

by Javid Pasha |   ( Updated:2024-06-24 14:05:14.0  )
నీవు పనికిరావంటూ ఎగతాళి చేశారు.. కట్‌చేస్తే ఇప్పుడామె స్టార్ హీరోయిన్!
X

దిశ, సినిమా : సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామంది కలలు గంటారు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోతే ఇక్కడ అవకాశాలు దొరకడం అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు మాత్రమే వాటిని ఓపిగా భరిస్తూనో, ఎదురిస్తూనో చివరికి అనుకున్నది సాధిస్తారు. అలాంటి వారిలో ఒక తెలుగమ్మాయి గురించి చెప్పుకోవాలి. ఆమె ఎవరో కాదు శోభితా ధూలిపాళ.

మూవీ చాన్సెస్ కోసం శోభిత పడరాని పాట్లు పడిందట. ప్రారంభంలో దాదాపు వెయ్యికి‌పైగా ఆడిషన్స్ ఇచ్చింది. మరెఎన్నో రిజెక్షన్లను ఫేస్ చేసింది. మొదట్లో కొందరు కాస్టింగ్ కౌచ్ యాంగిల్‌లో ఆలోచించి ‘నీవు నల్లగా ఉన్నావు. అందంగా లేవు. సినిమాల్లో పనికిరావు’’ అని కూడా అవమానించారట. కానీ శోభిత మాత్రం వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని సొంత టాలెంట్‌తో తన ప్రయత్నం కొనసాగించింది. కట్ చేస్తే ఇప్పుడామె ఓ స్టార్ హీరోయిన్. బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో సినిమాలో చేస్తోంది. గూఢచారి (2018) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా ఫేమ్ క్రియేట్ చేసుకుంది. అనిల్ కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, విక్కీ కౌశల్ వంటి స్టార్ యాక్టర్స్‌తో కలిసి వర్క్ చేసింది.

ప్రస్తుతం ఓటీటీలో హయ్యెస్ట్ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో శోభితా ధూళిపాళ కూడా ఒకరు. ఈ ఏడాది దేవ్ పటేల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘మంకీ మ్యాన్’ సినిమాతో హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. కాగా శోభిత టాలీవుడ్ కపుల్ సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత, నాగచైతన్యకు దగ్గరైనట్లు వార్తలు వచ్చాయి. శోభిత, చైతు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ దీనిపై వీరెన్నన్నడూ స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed