నన్ను తప్పుగా వాడుకోవాలని చూస్తున్నారు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-03-16 15:54:43.0  )
నన్ను తప్పుగా వాడుకోవాలని చూస్తున్నారు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ కిరణ్ రాథోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. విక్టరి వెంకటేష్ ‘జెమిని’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు అందుకోలేక పోయింది ఈ అమ్మడు. ఇక తర్వాత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లు చేస్తూ కొన్నాళ్లు నెట్టుకొచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కిరణ్ రాథోడ్ ఇటీవల బిగ్ బాస్ షోకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ షో కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ.. అసలు తన సినిమాలకు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో గతంలో చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సినిమా అవకాశాల కోసం చూస్తుంటే తప్పుగా వాడుకుందాం అనే చూసే వాళ్లే కానీ, అవకాశాలు ఇచ్చే వాళ్లు ఉండరు అంటూ ఎమోషనల్ అయింది ఆ బ్యూటీ. ఇక కిరణ్ రాథోడ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed