శ్రీవారికి ప్రేమలేఖ టు నువ్వే కావాలి.. రామోజీరావు నిర్మించిన సినిమాలు ఇవే!

by Jakkula Samataha |
శ్రీవారికి ప్రేమలేఖ టు నువ్వే కావాలి.. రామోజీరావు నిర్మించిన సినిమాలు ఇవే!
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో రామోజీరావు పాత్ర కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు నిర్మించేందుకు ఎన్నో ఫెసిలిటీస్ కల్పించారు. దూదర్శన్ ఉన్న సమయంలో ఈటీవీని తీసుకొచ్చారు. అలాగే ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక సినిమాలు నిర్మించారు. అంతే కాకుండా ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను పరిచయం చేశారు. అంతే కాకుండా ఆరోజుల్లో రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేది.

మొదటగా శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా ద్వారా ఉషా కిరణ్ మూవీస్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అది మంచి విజయం సాధించడంతో, బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను ఒకే సారి నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఏ మాత్రం బెదరకుండా రామోజీరావు రిస్క్ చేసి సినిమాలను తెరకెక్కించారు. కాగా, అందులో రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాయి. రామోజీరావు స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్‌లో మయూరి, ప్రతిఘటన లాంటి సినిమాలు ఓ హిస్టరీ అనే చెప్పవచ్చు. ప్రమాదంలో కాలు కోల్పోయిన నృత్యకారిణి సుధా చంద్రన్ జీవితం ఆధారంగా, ఆమెనే నటిగా పెట్టి ఆ సినిమా తీయడం అప్పట్లో తెగ చర్చానీయంశం అయ్యింది. ఇక ఆ తర్వాత ఈ నిర్మాణ సంస్థ అనేక సినిమాలను రూపొందించింది. అందులో ముఖ్యంగా..నచ్చావులే, నువ్వే కావాలి, అశ్వని, చిత్రం, ఆనందం, మయూరి , ప్రతిఘటన, శ్రీవారికి ప్రేమ లేఖ, మౌన పోరాటం లాంటి ఎన్నో సినిమాలను నిర్మించి, ఎంతో మంది నటీనటులకు మంచి లైఫ్ ఇచ్చింది ఉషా కిరణ్ మూవీస్. ఇక తర్వాత తర్వాత అనేక నిర్మాణ సంస్థలు రావడంతో దీనికి ఆధారణ తగ్గింది. చివరగా ఉషా కిరణ్ మూవీస్ దాగుడుమూత తండాకోర్ అనే సినిమాను నిర్మించింది. ఇదే చివరి సినిమా.

Advertisement

Next Story