అలంపూర్ ఆలయంలో రికార్డు స్థాయిలో వేలంపాటలు

by Naveena |   ( Updated:2024-10-25 11:46:18.0  )
అలంపూర్ ఆలయంలో రికార్డు స్థాయిలో వేలంపాటలు
X

దిశ, అలంపూర్ టౌన్: ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈఓ పురేందర్ ఆధ్వర్యంలో.. శుక్రవారం వేలంపాట నిర్వహించారు. ఒక సంవత్సరం పాటు పూజ సామాగ్రి అమ్ముకునేందుకు, పార్కింగ్ రుసుము వసూలు చేయడానికి, చీరల వేలం వేయుటకు దేవస్థానం అధికారులు వేలంపాట నిర్వహించారు. ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ వేలం పాట ద్వారా ఆలయాలకు సాగిన ఈ వేలం పాట ద్వారా వేలం పాట ద్వారా ఆలయాలకు మూడు కోట్ల 38 లక్షల 62వేల రూపాయల రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఇందులో మహేష్ గౌడ్ అనే వ్యక్తి పూజ సామాగ్రి అమ్ముకొనుటకు కు ఒక కోటి 27 లక్షలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. గతంలో కంటే 71 లక్షల 80,000లకు అధికంగా పాడారు . అదేవిధంగా పార్కింగ్ వేళాన్ని సతీష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 70 లక్షలకు దక్కించుకున్నారు. గతంలో కంటే పార్కింగ్ వేలం ద్వారా 15 లక్షల అదన పాదాయం సమకూరింది.చీరల వేలాన్ని మహేష్ గౌడ్ 91 లక్షలకు దక్కించుకున్నారు. గతంలో కంటే 62 లక్షలు అధికంగా పాడారు. ఫోటో క్యాసెట్లు 22 లక్షలు, కొబ్బరి చిప్పలు 12 లక్షల 30000, క్యాంటీన్ 9,లక్షల12వేలకు, మరుగుదొడ్లను 7 లక్షలు ఇరవై లకు,వసతి గృహాల వేలంపాట తొమ్మిది లక్షల 50 వేల రూపాయలకు సదరు వ్యక్తులు దక్కించుకున్నారు. గతంలో కంటే అధిక స్థాయిలో వేలంపాట ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed