తారకరత్న ఇప్పటివరకు ఏ ఏ సినిమాల్లో నటించాడంటే..?

by Javid Pasha |
తారకరత్న ఇప్పటివరకు ఏ ఏ సినిమాల్లో నటించాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు తారకరత్న. రావడంతోనే 9 సినిమాలకు ఒకేరోజు ముహూర్తం పెట్టించి రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలోనే 2002 తన మొదటి సినిమా 'ఒకటో నెంబర్ కుర్రాడు'తో రిలీజ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

నందమూరి తారకరత్న నటించిన సినిమాలు ఇవే..

నందమూరి తారకరత్న 2002లో రిలీజైన ఒకటో నెంబర్ కుర్రాడు మూవీలో హీరోగా టాలీవుడ్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఆయన నటించిన యువరత్న మూవీ విడుదల అయింది. 2003లో తారక్, 2004లో, 2006లో పాకదాయి, భద్రాద్రి రాముడు సినిమాలు విడుదల అయ్యాయి. 2009లో రిలీజ్ వచ్చిన అమరావతి మూవీలో తారకరత్న విలన్ పాత్రలో మెప్పించి నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. అనంతరం 2010లో ముక్కంటి, 2011లో నందీశ్వరుడు, 2012లో ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని సినిమాలు విడుదల అయ్యాయి. 2014లో మహా భక్త సిరియాల, 2015లో కాకతీయుడు మూవీస్ రిలీజ్ అయ్యాయి. 2016లో రిలీజైన ఎవరు, మనమంతా, రాజా చెయ్యి వస్తే మూవీల్లో తారకరత్న నటించాడు. 2017లో ఖయ్యూం భాయి, 2021లో దేవినేని, 2022లో సారథి, ఎస్ 5 నో ఎగ్జిట్ సినిమాలు విడుదల అయ్యాయి.


ఇక తారకరత్న టెలివిజన్ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. 2022లో వచ్చిన 9 హవర్స్ వెబ్ సిరీస్ లో ఆయన నటనకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు వరుసబెట్టి సినిమాలకు అవకాశాలు వచ్చాయి. అయితే గత జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ''యువగళం'' పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. చికిత్స పొందుతూ తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి చనిపోయాడు. కాగా ఆయన మృతి పట్ల ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్, వైసీపీ నేత విజయసాయి రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా తారకరత్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.

Advertisement

Next Story