- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటికల్ కాంట్రావర్సీగా ‘రజాకార్’ మూవీ.. సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: రజాకార్ల దురాగతాల నేపథ్యంలో తెరకెక్కిన ‘రజాకార్’ సినిమా తెలంగాణలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌పై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు, సెన్సార్ బోర్డుతో మాట్లాడి సినిమా విడుదలను ఆపేందుకు ప్రయత్నిస్తామని మంత్రి కేటీఆర్ అన్న విషయం తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని అన్నారు. రజాకార్ మూవీ పొలిటికల్ కాంట్రావర్సీగా మారడంతో తాజాగా ఆ సినిమా డైరెక్టర్ సత్యనారాయణ స్పందించారు.
రజాకార్ సినిమాను రాజకీయంగా చూడొద్దని ఆయన కోరారు. రజాకార్ సినిమాపై ఎన్నో వివాదాలు సృష్టిస్తున్నారని.. కానీ వివాదం చేసిన వారే తర్వాత మెచ్చుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. రజాకార్ సినిమా కేవలం చరిత్ర మాత్రమేనని తెలిపారు. ప్రస్తుత జనరేషన్‌కు తెలియని ఘటనలు చూపించే ప్రయత్నం చేశామన్నారు. సినిమాలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. ఇక, రజాకార్ మూవీ వివాదంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో గుడ్ గవర్నెన్స్ ఉందని చెప్పారు. రాష్ట్రంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. కాంట్రావర్సీగా మారిన రజాకార్ సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి : రజాకార్ సినిమాపై మంత్రి కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు