ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప వేరే మార్గం లేదు.. దుమారం రేపుతోన్న యంగ్ హీరో ట్వీట్

by Kavitha |
ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప వేరే మార్గం లేదు.. దుమారం రేపుతోన్న యంగ్ హీరో ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విమర్శించే నేపథ్యంలో సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, స‌మంత‌, ప్రకాశ్ రాజ్, అమ‌ల‌, ఎన్‌టీఆర్, నాని, అల్లు అర్జున్, మంచు విష్ణు, చిరంజీవి, నాగ చైత‌న్య, ఖుష్బూ, ఆర్జీవీ వంటి ప్రముఖులు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. తాజాగా అక్కినేని అమ‌ల చేసిన ట్వీట్‌కు ఆమె కుమారుడు, యంగ్ హీరో అక్కినేని అఖిల్ స్పందించారు. "అమ్మ.. మీ ప్రతి మాట‌కు నేను మ‌ద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విష‌యంపై మీరు స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేదు" అని అఖిల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed