- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలో చాలా షేడ్స్ ఉన్నాయి.. అక్కినేని కోడల శోభిత కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: శోభిత ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్ సితార’. వందన్ కటారియా దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 27 నుంచి డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ను గమనిస్తే... ప్రకృతి అందాలతో ఆకట్టుకునే కేరళ పచ్చటి అందాల నడుము తెరకెక్కిన కథే లవ్ సితార. తార (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్ర్య భావాలున్న ఇంటీరియర్ డిజైనర్. అంతర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళతారు. అక్కడ పెళ్లి జరగటానికి ముందు కుటుంబాల్లోని విబేదాలు, తెలియకుండా దాగిన నిజాలు బయటపడతాయి. చివరకు ఈ జంట ప్రయాణం ఎటువైపు సాగిందనేదే సినిమా.
ఇక ఈవెంట్‌లో శోభితా దూళిపాల మాట్లాడుతూ.. ‘సితారలో నటిచడం చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్యమైన పాత్ర. స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించాను. నిజాయతీగా ఉండే ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కొందనేదే కథ. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి’ అని చెప్పుకొచ్చింది.
Read More :
శోభిత పెళ్లి వీడియో వైరల్.. ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొన్నానంటూ పోస్ట్
రానా టాక్ షోకు నాగచైతన్య-శోభిత.. సీక్రెట్ లవ్‌స్టోరీని బయటపెట్టనున్నారా?