- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక కొత్త సినిమాలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు.. వారు ఎవరంటే..?
దిశ,వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల సినిమా నిర్మాతగా బిజీ కానున్నారు.తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్‌లు నిర్మించిన నిహారిక.. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే ఫీచర్ ఫిలింస్ నిర్మాణంలోకి దిగిపోయారు. నిర్మాతగా తన తొలి సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదువంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం అవుతున్నారు. వారు ఎవరో ఇక్కడ చూద్దాం..
కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నిహారిక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు నటిస్తున్నారు. దీని పై స్పందించిన నెటిజెన్స్.. మెగా డాటర్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.