oscars 2023-Naatu Naatu: చంద్ర‌బోస్ స్వ‌గ్రామంలో ఆస్కార్‌ సంబ‌రాలు

by Javid Pasha |   ( Updated:2023-03-13 05:25:33.0  )
oscars 2023-Naatu Naatu: చంద్ర‌బోస్ స్వ‌గ్రామంలో ఆస్కార్‌ సంబ‌రాలు
X

దిశ‌, వ‌రంగల్ బ్యూరో : ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట‌కు ఆస్కార్ అవార్డు ద‌క్క‌డంతో సోమ‌వారం ఉద‌యం సినీ గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ స్వ‌గ్రామమైన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండ‌లం చ‌ల్ల‌గ‌రిగేలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. చంద్ర‌బోస్ బాల్య‌మిత్రులు గ్రామంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. చంద్ర‌బోస్ రాసిన పాట‌కు ఆస్కార్ అవార్డు ద‌క్క‌డంపై ఆయ‌న మిత్రులు సంతోషం వ్య‌క్తంచేశారు. త‌మ‌కెంతో గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు. తన పాటతో దేశానికి ఎంతో పేరును తీసుకొచ్చారని చంద్రబోస్ పై ప్రశంసలు కురిపించారు.

Next Story