Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

by Prasanna |
Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన మూవీ " విశ్వం ". భారీ బడ్జెట్ తో రూపొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ పతాకం పై టిజి విశ్వప్రసాద్, దోనేపూడి చక్రపాణి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, పాటలు అందర్ని ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ కామెడీతో పాటు భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ మూవీ హీరో, డైరెక్టర్ ఇద్దరికీ ప్లస్ అవుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీలో గోపీచంద్ యాక్షన్ తో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ కూడా ఉండబోతుందని అర్ధమవుతుంది. అలాగే, ఈ మూవీ కాన్సెప్ట్ ఓ సమస్య చుట్టూ తిరుగుతుందని ప్రమోషన్స్ లో శ్రీనువైట్ల తెలిపారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 11న ఆడియెన్స్ ముందుకు రానుంది.

Advertisement

Next Story