- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ టైం వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ‘జెనీలియా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘బొమ్మరిల్లు, ఢీ, రెడీ’ లాంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న సమయంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొని పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ గత ఏడాది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ‘ట్రయల్ పీరియడ్ పేరుతో తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.
కాగా.. జులై 21 నుంచి జియో మూవీ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా జెనీలియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ‘‘సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్‌ను ఒకే చెప్పేందుకు ఆ కథ చదవడం కోసం చాలా టైం తీసుకుంటారు. కానీ నేను ఈ వెబ్‌సిరీస్‌ను గంటలో చదివి ఓకే చెప్పేశాను. నాకు ఈ కథ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను రీఎంట్రీ ఇవ్వాలనుకునే టైంలోనే ఈ స్ర్కిప్ట్ నా దగ్గరకు వచ్చింది. ఈ సిరీస్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.’’ అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మాట్లాడినటువంటి మాటలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Read More..