పెళ్లి కాకుండానే రెండో సారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫోటోలు వైరల్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-23 07:07:06.0  )
పెళ్లి కాకుండానే రెండో సారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊపిరి’ సినిమాలో తళుక్కున మెరిసిన అందాల భామ గాబ్రియెల్లా డెమోట్రియాడ్స్ పెళ్లి కాకుండానే రెండో సారి తల్లి కాబోతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ మోడల్ బాలీవుడ్ నటుడు, హీరో అర్జున్ రాంపాల్ తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ జంటకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను ఈ మోడల్ ఇన్ స్టా లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా 2018 నుంచి సహ జీవనం చేస్తున్నారు. ఈ జంటకు 2019లో అరిక్ రాంపాల్ పుట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్ 29న తాను మరో సారి గర్భం దాల్చినట్లు గాబ్రియెల్లా వెల్లడించారు. అయితే అర్జున్ రాంపాల్ కు ఇది వరకే పెళ్లి కాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజా ఫోటోలు చూసిన నెటిజన్లు మరి పెళ్లి ఎప్పుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Read More... రామ్ చరణ్‌ను ఇంట్లో అలా పిలుస్తారా? కొత్తపేరు బయటపెట్టిన నిహారిక

Advertisement

Next Story